Salim Durani: టీమిండియా దిగ్గజ క్రికెటర్ సలీమ్ దురానీ కన్నుమూత
Salim Durani: టీమిండియా దిగ్గజ స్పిన్నర్ సలీం దురానీ ఇవాళ కన్నుమూశారు. భారత ప్రభుత్వం అందించే అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డును అందుకున్న తొలి క్రీడాకారుడిగా దురానీ గుర్తింపు పొందారు.
Salim Durani Passes away: భారత మాజీ క్రికెటర్ సలీం దురానీ (88) కన్నుమూశారు. చాలా కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న దురానీ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం గుజరాత్‌లోన జామ్‌నగర్‌లో తన సోదరుడు జహంగీర్ దురానీతో కలిసి నివసిస్తున్న ఆయన ఈ ఏడాది జనవరిలో తొడ ఎముక ఆపరేషన్ చేయించుకున్నాడు. కాబూల్‌లో జన్మించిన దురానీ.. ఇప్పటి వరకు 29 టెస్టులు ఆడాడు. ఒక సెంచరీ, 7 అర్ధ సెంచరీలతో 1202 పరుగులు చేసిన దురానీ.. 75 వికెట్లు కూడా పడగొట్టారు.
1961-62లో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను గెలవడంలో సలీం దురానీ కీలకపాత్ర పోషించాడు. ఐదు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 2-0తో గెలుచుకుంది. ఈ సిరీస్ లో దురానీ 18 వికెట్లు పడగొట్టాడు. 1971లో వెస్టిండీస్‌పై భారత్ విజయం సాధించడంలో కూడా దురానీ కీ రోల్ ప్లే చేశాడు. ఆ మ్యాచ్ లో స్టార్ ఆటగాళ్ల అయిన క్లైవ్ లాయిడ్ మరియు సర్ గార్ఫీల్డ్ సోబర్స్‌లను ఔట్ చేశాడు. ఈ స్టైలిష్ క్రికెటర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 33.37 సగటుతో 8,545 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు కూడా ఉన్నాయి.
1934, డిసెంబర్ 11న అఫ్గానిస్థాన్‌లోని కాబూల్‌లో దురానీ జన్మించారు. 1947లో భారత్-పాక్ విభజన అనంతరం దురానీ కుటుంబం భారత్ కు వచ్చి స్థిరపడింది. 1960లో ఆస్ట్రేలియాపై ఆరంగ్రేటం చేసిన దురానీ 1960-70 దశకంలో బెస్ట్ ఆల్‌రౌండర్‌గా నిరూపించుకున్నారు. క్రికెటర్ రాణించడమే కాదు దురానీ సినిమాల్లో కూడా సత్తా చాటారు. 1973లో ‘'చరిత్ర'’ అనే సినిమాతో దురానీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అర్జున అవార్డు గెలుచుకున్న తొలి భారత క్రికెటర్ కూడా ఈయనే.
Also read: IPL 2023: సీఎస్కే ఓటమికి కారణం ఆ ఓవర్, ఆ బౌలర్ ఖరీదు 14 కోట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook